Yuvraj Singh Super Innings: 6 6 6 6 6 4.. మరోసారి యువరాజ్ సింగ్ సునామి ఇన్నింగ్స్

Yuvraj Singh Tsunami innings once again

Yuvraj Singh Super Innings : ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే టీమిండియా స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ విశ్వరూపం చూపిస్తాడు. కీలకమైన మ్యాచ్ లలో సునామీ ఇన్నింగ్స్ లతో అదరగొట్టే యూవీ మరోసారి కంగారు టీమ్ కు బిగ్ షాకిచ్చాడు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత జట్టును ఫైనల్ చేర్చాడు. భారత ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ బ్యాట్ ఝుళిపించి కంగారులను టోర్నీ నుంచి ఔట్ చేశాడు. కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 బౌండరీలతో 59 పరుగులు ఇన్నింగ్స్ తో ఈ టోర్నీలో భారత్ ను ఫైనల్ కు చేర్చాడు.

సిక్సర్ల సింగ్ గా పేరొందిన యువరాజ్ సింగ్ 2024 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లీగ్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో మరోసారి రెచ్చిపోయి ఆస్ట్రేలియన్లకు పీడకలగా నిలిచాడు. రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఇక బౌలింగ్ లోనూ మంచి ప్రదర్శన చేయడంలో భారత జట్టు 86 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఛాంపియన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో భారత్ ఛాంపియన్స్ జట్టు టైటిల్ కోసం పోరాడనుంది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది.

అంతకుముందు కూడా యువరాజ్ సింగ్ ఒంటిచేత్తో ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శనలు చేసి భారత్ కు అనేక విజయాలు అందించాడు. మరీ ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టుకు అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ జట్టు 262 పరుగుల టార్గెట్ ను ఆసీస్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ లోనూ యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. యువీ 2 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

Previous articleIRCTC: వేచి ఉండకుండా తత్కాల్ టికెట్స్ తక్షణమే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా – ఇదిగో!
Next articleBreaking News: ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. అంబానీ పెళ్లిలోనే తేల్చేసారు..