Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?

Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?
Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?

Dry Fish: హార్ట్, షుగర్ పేషెంట్లు ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా?

చేపలకూర అనగానే చాలమందికి నోరూరుతుంది. ఇంక ఎండు చేపల గురించి అయితే చెప్పనవసరం లేదు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అయినా సరే వీటిని కొందరు తినకూడదట.

ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.

చాలామంది ఇష్టంగా తినే ఆహారాలలో ఎండు చేప ఒకటి. మనం రెగ్యులర్ గా చేపలను తింటుంటాం. కానీ వీటిని తిన్నట్లు ఎండు చేపలను తినము. కొందరు నాన్ వెజ్ తినేవాళ్లు కూడా ఎండు చేపలను తినరు. ఎందుకంటే వాటినుంచి వచ్చే వాసన అందరికి నచ్చదు. నాన్ వెజ్ లో అధిక కొవ్వులేని ఆహారం ఏదైనా ఉందా అంటే అవి చేపలే. ఎండుచేపలో 80-85 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది.

ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.

– రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నవారికి ఎండు చేప కూర చాలా మంచిది.

– మూత్రాశయం, అండాశయం, గర్భాశయం లాంటి సమస్యలు మహిళలకు ఎక్కువగా వస్తాయి వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.

– ఎండు చేప వాతం, పిత్తం, రక్త ప్రసరణ లాంటి సమస్యలను నయం చేస్తుంది.

– పాలిచ్చే తల్లులు ఎండు చేప తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా, రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదు. చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదట. అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు.

ఇప్పుడు కూడా తినకండి!

తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా సైనస్ సమస్య, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్య ఉన్నవారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Previous articleపైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం ఎలానో తెలుసా..
Next articleభోజనం చేశాక ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు..!