ఐఫోన్ లో “i” అంటే ఏమిటి.. దీని వెనుక ఇంత చరిత్ర ఉందా..?
యాపిల్ నుంచి ఐఫోన్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అయినా ఈ ఫోన్ బ్రాండ్ మాత్రం పడిపోవడం లేదు. ఎప్పటికప్పుడు ఈ ఫోన్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లు వస్తు యూజర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో బ్రాండ్ ఫోన్ గా ఐ ఫోన్ మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 కోట్ల వరకు ఐఫోన్ యూజర్లు ఉన్నారంటే ఆ బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఐఫోన్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.
అందరూ అనుకున్నట్లు ఐఫోన్ ను స్మార్ట్ఫోన్ గా లాంచ్ చేయాలని అనుకోలేదట.ఎందుకంటే 2005కు ముందు టచ్ స్క్రీన్ ఫోన్లు అసలు లేనే లేవు. అయితే కొంత మంది ఇంజనీర్లు టచ్ స్క్రీన్ టాబ్లెట్లను తయారు చేసి స్టివ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళారు. దీన్ని ఆయనకు చూపించడంతో ఆయనకు ఇది నచ్చింది. కానీ దాన్ని అప్రూవ్ చేయకుండా ఆ టచ్ స్క్రీన్ టాబ్లెట్ కు బదులు, స్మార్ట్ ఫోన్ తయారు చేయాలని జాబ్స్ అన్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ సమయంలో టాబ్లెట్లను ఇంకా ఏ కంపెనీ కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటి సమయంలో తమ కొత్త ప్రాజెక్టుగా ట్యాబు రిలీజ్ చేస్తే సక్సెస్ అవ్వదని భావించి, స్మార్ట్ఫోన్ తీసుకురావాలని అన్నారట స్టివ్.
దీంతో మొట్టమొదటి ఐఫోన్ ను 2007 జనవరిలో మొదటి సారి రిలీజ్ చేశారు. జూన్ లో అమెరికాలో ఐ ఫోన్ మొదటిసారి మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో రెండు మోడల్స్ ను రిలీజ్ చేశారు. ఆపిల్ కు సంబంధించిన ఫోన్ లన్నింటికీ “i”అని పిలుస్తారు. మరి దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. దీని గురించి స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఫోన్ లాంచ్ చేసే సమయంలో “ఐ” అంటే అర్థం ఇంటర్నెట్ అని చెప్పారు. ఆ సమయంలో ఇంటర్నెట్ అనేది ప్రజలకు చాలా కొత్త పదం. దీంతో ఐఫోన్ లో ఇంటర్నెట్ ను అప్లై చేయడం చాలా సులభం అని చెప్పారు. దీని తర్వాత “i” అంటే inspire, instruct, individual, inform అని చెప్పారు.