Weight Loss:కేవలం 10 రోజులు ఇది తాగితే చాలు మీ తొడలు,పిరుదులు,పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది
Green Tea Weight loss Tips In Telugu :కేవలం 10 రోజులు ఇది తాగితే చాలు మీ తొడలు,పిరుదులు,పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది.. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు
మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గటానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో అందుబాటులో ఉన్నాయి వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ లో సగం పసుపు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నిమిషాలు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా పది రోజులు తాగితే తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.