UPI Limit 2023 : ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్‌ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

 UPI Limit 2023 : ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్‌ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే.

UPI Limit 2023 : ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్‌ పే ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చంటే..

ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే వంటివి చాలా పాపులర్ అయిపోయాయి. జనాలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. డబ్బులు పంపాలన్నా, డబ్బులు పొందాలన్నా, లేదంటే మర్చంట్లకు పేమెంట్ చేయాలన్నా వీటినే ఎక్కువగా వాడుతున్నారు.

అందువల్ల ఫోన్‌పే, గూగుల్ పే (GPay) వంటివి వాడే వారు రోజుకు ఎంత డబ్బులు (Money) పంపొచ్చు అనే అంశాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అప్పుడే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. దేని దేని లిమిట్ ఎంతనో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం చూస్తే.. యూపీఐ ద్వారా రోజుకు గరిష్టంగా రూ. లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. అయితే కొన్ని బ్యాంకులు ఈ లిమిట్‌ను తక్కువగా కూడా ఉండొచ్చు. చిన్న బ్యాంకులు రూ. 25 వేలకు లిమిట్ విధిస్తాయి. అంటే బ్యాంక్ ఆధారంగా యూపీఐ లిమిట్ మారుతుందని గుర్తించుకోవాలి. 

అమెజాన్ పే వాడే వారు రోజుకు రూ. లక్ష వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అయితే కొత్తగా అమెజాన్ పే రిజిస్టర్ చేసుకుంటే రూ. 5 వేల వరకు లిమిట్ ఉంటుంది. బ్యాంక్ ఆధారంగా రోజుకు నిర్వహించే ట్రాన్సాక్షన్ల సంఖ్య 20 వరకు ఉంటుంది. అదే మీరు పేటీఎం వాడుతూ ఉంటే.. రోజుకు రూ. లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. గంటకు రూ.20 వేల చొప్పున పంపొచ్చు. రోజుకు గరిష్టంగా 20 లావాదేవీలు నిర్వహించొచ్చు. గంటకు ఐదు లావాదేవీల వరకు చేసుకునే అవకాశం ఉంటుంది.

అలాగే ఫోన్‌పే విషయానికి వస్తే.. రోజుకు రూ. లక్ష వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రోజుకు 10 నుంచి 20 వరకు ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. ఇక గూగుల్ పే విషయానికి వస్తే.. రోజుకు 10 వరకు ట్రాన్సాక్షన్లు మాత్రమే నిర్వహించగలరు. రోజుకు రూ. లక్ష వరకు డబ్బులు పంపొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌లో గంటకు ఇన్ని ట్రాన్సాక్షన్లు అంటూ ఎలాంటి పరిమితులు ఉండవు. అందవల్ల ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మీరు మరో విషయాన్ని గుర్తించుకోవాలి. యూపీఐ ద్వారా రోజుకు రూ. లక్ష వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే అన్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు ఇది వర్తిస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అంటే ఫోన్ పే ద్వారా కొంత, గూగుల్ పే ద్వారా మరి కొంత పంపితే.. ఆ రెండింటినీ కలిపి యూపీఐ లిమిట్‌గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Previous articleBeauty tips: నుదుటిపై ఉన్న నలుపును పోగొట్టుకోవడానికి ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..
Next articleSprouted Coconut | కొబ్బరికాయలో పువ్వు వచ్చిందా? అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకోండి!