Breaking News: డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. అసలేం జరిగింది అంటే..?

నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు కలకలం సృష్టించింది. పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ర్యాలీలో జరిగిన కాల్పుల్లో ఓ బుల్లెట్‌ తన కుడి చెవి పైభాగంలో నుంచి వెళ్లిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

కాగా.. కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని హతమార్చారు. దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న సాదారణ పౌరుడు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ట్రంప్‌ లక్ష్యంగా దాడి జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి అనుమానిస్తున్నారు. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను హత్యాయత్నంగానే భావిస్తున్నారు.

దాడి ఎలా జరిగిందంటే?

అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఈ దాడి జరిగింది. ట్రంప్ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. దీంతో కాల్పుల ఘటన అంతా వీడియోల్లో రికార్డయ్యింది. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడం, ఆయనకు గాయమవ్వడం అంతా రికార్డయ్యింది. కాల్పుల శబ్దం విన్న వెంటనే పోడియం కిందకు చేరిన ట్రంప్.. తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆయన్ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. తనపై జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబానికి, గాయపడివ వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి దాడి జరగడం నమ్మశక్యంగా లేదని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం తెలియదని పేర్కొన్నారు.

గతంలోనూ ఇలాంటి దాడులు

అమెరికాలో రాజకీయ నాయకులపైన గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాకు రాజకీయ హింస చరిత్ర ఉంది. గతంలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అభ్యర్థులపై దాడులు జరిగాయి. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తన మోటర్ కేడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఆయన్ని దారుణంగా హత్య చేశారు. జాన్ ఎఫ్ కెన్నెడీ సోదరుడు బాబీ కెన్నడీని 1968లో దుండగులు కాల్చి చంపారు. 1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగింది.

Previous articleసైబర్ సెల్ అవసరం లేకుండా ఏ నెంబర్ కాల్ హిస్టరీ అయిన ఇలా పొందండి
Next articleAnant Ambani: అనంత్ అంబానీ మల్లి బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తరువాత ఏం జరిగింది..?