Pregnant women : గర్బంతో ఉన్న వారు ఓఆర్‌ఎస్ తాగితే ఏమవుతుంది?

 Pregnant women : గర్బంతో ఉన్న వారు ఓఆర్‌ఎస్ తాగితే ఏమవుతుంది?

Pregnant women : గర్బంతో ఉన్న వారు ఓఆర్‌ఎస్ తాగితే ఏమవుతుంది?

తినే విషయంలో తాగే విషయంలో ఒక మహిళ గర్భవతి అయిన సమయంలో సమస్య మొదలు అవుతుంది. అంతకు ముందు వరకు తినే విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకపోవడంతో ఇష్టానుసారంగా తిన్న వారు ఎప్పుడైతే గర్భవతి అవుతారో అప్పటి నుండి అసలు సమస్య మొదలు అవుతుంది. ఇష్టమైనది తినకూడదు అంటారు.. తినొచ్చు అనేవి నోటికి రుచి కలిగించవు. అలా గర్భవతులు కొన్నాళ్ల పాటు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా 5వ నెల వచ్చే వరకు చాలా మందికి వాంతులు మరియు వికారం ఉంటుంది. ఏది తినాలన్నా కూడా వాంతులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు అది చూడగానే వికారం అనిపిస్తుంది. కొన్ని చూసిన సమయంలో వాంతులు వచ్చినట్లుగానే అనిపిస్తుంది. అందుకే వాంతులు వచ్చిన సమయంలో తినడానికి ఏది ఇష్టం ఉండదు.  .

ఆ కారణంగానే గర్భవతుల ఆహారపు అలవాట్లు చాలా విభిన్నంగా ఉంటాయి.

వాంతులు అధికంగా అవుతున్న సమయంలో కొందరు ఓఆర్‌ఎస్ తాగేందుకు సిద్దం అవుతారు. సాధారణంగా అయితే వాంతులు అయ్యి లేదా విరేచనాలు అయ్యి ఇబ్బందిగా ఉన్న వారికి కళ్లు మూసుకుని ఓఆర్‌ఎస్ ఇచ్చేయవచ్చు. కాని గర్భవతుల విషయంకు వచ్చేటప్పటికి వారు తీసుకునే మెడిసిన్‌ మరియు వారి గర్భం పరిస్థితిని బట్టి ఆలోచించాల్సి ఉంటుంది.

తాజాగా ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక మోస్తరుగా వాంతులు వస్తున్న సమయంలో నీరసంగా అవ్వడం వల్ల ఓఆర్‌ఎస్ తీసుకోవచ్చు. ఓఆర్‌ఎస్ తీసుకున్న కూడా గర్బవతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓఆర్ఎస్ అనేది ఇంకా ప్రయోజనం చేకూర్చుతుంది కాని గర్భవతులకు ఎలాంటి ఇబ్బందిని క్రియేట్‌ చేయదు అంటూ నిపుణులు చెబుతున్నారు. కనుక గర్భవతులు వాంతులు అయ్యి డీ హైడ్రేషన్‌ అయిన సమయంలో ఖచ్చితంగా ఓఆర్‌ఎస్ తీసుకోవచ్చు. కాని అధికంగా ఓఆర్‌ఎస్‌ తీసుకోవడం కూడా నష్టమే అంటున్నారు.

ఎందుకంటే దగ్గు లేదా జలుబు అయ్యే అవకాశం ఉంది. తద్వారా గర్భంతో ఉన్న సమయంలో ఇతర మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. గర్బంతో ఉన్న వారు ఇతర ట్యాబ్లెట్లను వేసుకోవడం మంచిది కాదు. తద్వారా ఓ ఆర్‌ ఎస్ అనేది ఎంత వరకు తీసుకోవాలో అంత వరకు తీసుకుంటే బెటర్‌ అంటూ నిపుణులు చెబుతున్నారు. గర్భవతులు ఎక్కువగా వాంతులు అవుతున్నాయి అంటే వారికి ఓ ఆర్‌ ఎస్‌ తో పాటు తప్పనిసరిగా ఇన్‌ స్టాంట్‌ ఎనర్జీ ఇచ్చే ఆహారం అవసరం.

వాంతులు అవుతున్నా కూడా కాస్త అన్నం లేదంటే ఏదైనా టిఫిన్ తినాలి. మరో వైపు సాధ్యం అయినంత ఎక్కువగా పండ్లను కూడా తినడానికి ఇంట్రస్ట్ చూపించాలి. అలా రక రకాలుగా శక్తిని కూడగట్టుకోవడం వల్ల వాంతులు అయినా కూడా గర్భవతులు ఢీలా పడిపోకుండా ఉంటారు. వాంతులు అయిన సమయంలో ఓ ఆర్‌ ఎస్ కాని ఆహారం కాని తీసుకోక పోవడం వల్ల కడుపులో ఉన్న పిండం కు కూడా ఎఫెక్ట్‌ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Previous articleContract teachers:ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త..ఇక 12 నెలల జీతం చెల్లింపు
Next articleBeetroot Side Effects: వీరు బీట్‌రూట్ అతిగా తింటే అంతే సంగతి.. మీరు కూడా తినొచ్చా?