Old 100 Note: లక్కంటే ఇదే! ఒకే ఒక వంద నోటుకు ఏకంగా రూ.56 లక్షలు
100 Note Sold For Rs 56 Lakhs: పాతపడ్డ కొద్దీ విలువ పెరుగుతుంది అంటే ఇదే కావొచ్చు. దశాబ్దాల కాలం నాటి కేవలం వంద రూపాయల నోటుకు ఏకంగా రూ.56 లక్షలు దక్కాయంటే ఇది మామూలు జాక్‌పాట్ కాదు.
చలామణీలో లేని పాత నోటుకు అత్యధిక ధర లభించింది. నోటు విలువ వందనే కాదు ఇప్పుడు పలికిన రేటు మాత్రం అర కోటికి పైగా పలికింది. ఈ వార్త ట్రేడ్ మార్కెట్‌లో సంచలనం రేపింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్‌లో కొన్ని వెబ్‌సైట్లు పాత నోట్లు, నాణేలు కొనుగోలు చేస్తుంటాయి. పాత నోట్లు, నాణేలకు భారీ విలువ ఉంటుంది. ఆన్‌లైన్ వేదికగా జరిగే వేలం పాటల్లో పురాతన నగదుకు భారీ విలువ పలుకుతుంటుంది. పాత కరెన్సీ.. పాత కరెన్సీ నోట్లకు ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లకన్నా అత్యధిక విలువ ఉంటుంది. పాత కరెన్సీ, నాణెల్లో ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటే వాటికి విలువ మరింత పెరుగుతుంది. దీంతో ఆ నోటు.. ఆ నాణేలు కలిగి ఉన్న వారికి భారీగా డబ్బులు వస్తుంటాయి.
లండన్‌లో జరిగిన ప్రత్యేక వేలంపాటలో వంద రూపాయల నోటుకు భారీగా ధర పలికింది. వేలంలో రూ.56,49,650కి రూ.వంద నోటు అమ్ముడైంది. 1950లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ‘హజ్ నోట్’ దీని సీరియల్ నంబర్ హెచ్‌ఏ 078400. హజ్ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఈ నోటును విడుదల చేశారు. బంగారన్ని అక్రమ కొనుగోలు నుంచి నిరోధించడానికి ఈ నోటును ప్రవేశపెట్టారు.
అయితే ఈ నోట్లు భారతదేశంలో చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. హెచ్‌ఏ ద్వారా ఈ నోట్లు వేరు చేయబడ్డారు. ఈ నోట్లు భిన్నమైన రంగులో ఉంటాయి. వంద రూపాయల నోటును గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌లో ఈ నోట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే 1961లో కువైట్ ప్రభుత్వం సొంత కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో 1970 నుంచి
ఈ నోట్లు చలామణీలో లేకుండా అయ్యాయి.