తర్వాత 12 శాతం తగ్గే అవకాశాలు
భారత జనాభాపై ఐరాస అంచనాలు
india Population | యునైటెడ్ నేషన్స్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది.
2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది. ఆ తర్వాత 12 శాతం(దాదాపు 20 కోట్లు) తగ్గుదల ఉంటుందని, అయినప్పటికీ, ఈ శతాబ్దం అంతా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్‌ఏ) ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2024’ నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో జననాల రేటు తగ్గుదలతో చైనాలో జనాభా భారీగా పడిపోతుందని, 2025 నాటికి 121 కోట్లకు, ఈ శతాబ్దం చివరి నాటికి ఏకంగా 63.3 కోట్లకు దిగి వస్తుందని అంచనా కట్టింది.
ప్రపంచ జనాభా పెరుగుదల
2024- 820 కోట్లు
2080- 1,030 కోట్లు(అంచనా)
2100- 1,020 కోట్లు(అంచనా)
భారత్ జనాభా పెరుగుదల
2024- 145 కోట్లు
2054- 170 కోట్లు( అంచనా)
2,100 -150 కోట్లు(అంచనా)
భారీగా తగ్గనున్న చైనా జనాభా
2024- 141 కోట్లు
2054- 121 కోట్లు(అంచనా)
2,100- 63.3 కోట్లు(అంచనా)