Health Tips: మీ శరీరంలో ఈ జబ్బులు కనిపిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు మరి విటమిన్ బి 12 లభించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం
మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల పోషకాలతో పాటు విటమిన్లు మినరల్స్ కూడా అవసరం అయితే విటమిన్ బి12 చాలా ముఖ్యమైన విటమిన్ ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరాను అందజేయడంలో సహాయపడుతుంది.
ఈ విటమిన్ లోపం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు- మీలో విటమిన్ బి 12 లోపం ఉన్నట్లయితే అది ముఖ్యంగా కనిపించే సంకేతము కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడడం విటమిన్ బి12 లోపం వల్ల రక్త సరఫరా అవయవాలకు సరిగా అనదు అటువంటి సమయంలో ముఖ్యంగా కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి.
తూలడం- విటమిన్ బి1 లోపం వల్ల కొంతమందిలో తల తిరగడం తూలడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
మెదడుకు సక్రమంగా రక్త సరఫరా అందినప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది వీటి వల్ల లోపానికి కారణం కావచ్చు. దీన్ని అధిగమించడం కోసం మీ ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారంతో పాటు వల్ల అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. రక్తహీనత- విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.
ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి 12 ఎక్కువగా మాంసాహారం గుడ్డు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చు. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడం కోసం విటమిన్ బి12 సప్లిమెంట్స్ ను వాడొచ్చు.
అంతేకాకుండా ఇది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని aplive ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.