Contract teachers:ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త..ఇక 12 నెలల జీతం చెల్లింపు
ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చలర్ల జీతాల పై తాజాగా కీలక ప్రకటన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు 12 నెలల జీతం చెల్లించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో 10 నెలల జీతమే ఇచ్చేదని… ఇప్పుడు 12 నెలల జీతం ఇవ్వడం సంతోషకరమని ఏపీ gef చైర్మన్ వెంకటరామిరెడ్డి అన్నారు. అంతేకాదు ఈ నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు వెంకట్రాంరెడ్డి.