Collagen Benefits : వయసు పెరిగినా.. యవ్వనంగా ఉంచుతుందట.. మరిన్ని బెనిఫిట్స్ ఇవే..

 Collagen Benefits : వయసు పెరిగినా.. యవ్వనంగా ఉంచుతుందట.. మరిన్ని బెనిఫిట్స్ ఇవే..

Collagen Benefits : వయసు పెరిగినా.. యవ్వనంగా ఉంచుతుందట.. మరిన్ని బెనిఫిట్స్ ఇవే..

Collagen Benefits : కొల్లాజెన్ మీ శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్. స్నాయువులు, చర్మం, కండరాలతో సహా శరీరంలోని అనేక భాగాలను రూపొందించే బంధన కణజాలాలలో ఇది ప్రధాన భాగం.

ఇది మీ చర్మానికి మంచి రూపాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మీ ఎముకలను బలంగా చేస్తుంది. ఇది మీరు వయసు పెరిగినా యవ్వనంగా ఉండడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు దీనివల్ల బరువు తగ్గుతామని.. మెదడుకు మంచిదని అంటున్నారు. ఇంతకీ అది నిజమో.. కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికై..

కొల్లాజెన్ మీ చర్మ సంరక్షణలో ప్రధాన భాగం. ఇది ముఖ్యంగా చర్మాన్ని సాగదీయడానికి, హైడ్రేట్ చేయడానికి పనిచేస్తుంది. మీ శరీరం తక్కువ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తే.. అది మీకు పొడి చర్మం, ముడతలకు దారితీస్తుంది. అయితే అనేక అధ్యయనాలు కొల్లాజెన్-రిచ్ పెప్టైడ్స్ లేదా కొల్లాజెన్ కలిగి ఉన్న సప్లిమెంట్స్ పొడిని తీసుకోవడం ద్వారా మీ చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిరూపించాయి.

కొల్లాజెన్ సప్లిమెంట్స్ మీ శరీరంలో యాంటీ రింక్ల్ ఎఫెక్ట్స్ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి.. వాటిని ఉత్తేజపరిచే సామర్థ్యానికి కారణమవుతాయని నిపుణులు తెలిపారు. మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో కొల్లాజెన్ సప్లిమెంట్స్ సహాయపడతాయి. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మీ చర్మం నిర్మాణంలో సహాయపడే ఇతర ప్రొటీన్లు.. మీ శరీరం ఉత్పత్తిని కూడా పెంచుతాయని.. వాటిలో ఎలాస్టిన్, ఫైబ్రిలిన్ దీనికోసం సహాయం చేస్తాయని తెలిపారు.

జుట్టు కోసం..

జుట్టు దాని సహజ రంగును మెలనిన్ నుంచి పొందుతుంది. మీ శరీరంలోని ఉత్పత్తి కణాలు మెలనిన్ స్రవిస్తాయి. వయసు పెరిగే కొద్ది.. మన శరీరంలోని మెలనిన్​ను ఉత్పత్తి చేసే కణాలు నాశనం కావడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా మన జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు నెరసిపోవడం అనేది మీ జన్యువులు, ఒత్తిడి, తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.

అలాగే జుట్టుకు హాని కలిగించే అనేక రకాల కెమికల్స్​ను ఉపయోగిస్తుంటాం. ఇవి కూడా జుట్టు నెరసిపోవడానికి దారితీస్తాయి. కొల్లాజెన్ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మీ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది

ఇతర ప్రయోజనాలు

గోర్లు: కొల్లాజెన్ తీసుకోవడం వల్ల మీ గోళ్లకు బలం చేకూరుతుంది.

మెదడు: మెదడు ఆరోగ్యంలో కొల్లాజెన్ సప్లిమెంట్ల పాత్రను ఏ అధ్యయనాలు పరిశీలించలేదు. అయినప్పటికీ.. కొందరు కొల్లాజెన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని, ఆందోళనను తగ్గిస్తుందని తెలిపారు.

బరువు తగ్గడానికై : కొల్లాజెన్ సప్లిమెంట్లు బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థను పెంచడానికి సహాయపడుతుందని కొందరు నమ్ముతారు.

వాపు, ఆస్టియో ఆర్థరైటిస్‌ను తగ్గించడం : కొల్లాజెన్ సప్లిమెంట్‌లు శరీరంలో మంటను తగ్గించడానికి, కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తాయని తేలింది. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి జాయింట్ డిజార్డర్స్‌తో బాధపడేవారికి నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది.

కొల్లాజెన్‌ను ఎలా పొందవచ్చు..

అలోవెరా -అలోవెరా జెల్ చర్మ సంరక్షణకు, గాయాలకు చికిత్స చేయడానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కట్స్, కాలిన గాయాల నుంచి ఉపశమనం ఇవ్వడంలో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే కలబందను నేరుగా అప్లై చేయడం, తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

విటమిన్-సి – విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ స్థాయి పెరుగుతుంది. నారింజ, ఎర్ర మిరియాలు, మొలకలు, బ్రోకలీ, స్ట్రాబెర్రీ వంటి ఆహారాలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది

జిన్సెంగ్ – జిన్సెంగ్ మొక్కలో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అనేక రసాయన ఔషధాల వల్ల ప్రతికూల రసాయన ప్రతిచర్యలకు కారణం కాకుండా చర్మంలోకి వెళ్తుంది. చర్మం దాని అసలు ఆకృతిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.


అదనంగా చికెన్, చేపలు కొల్లాజెన్​కు గొప్ప వనరులు. ఇవి కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి.

Previous articleNara disti remedies:నరఘోష తగలకుండా ఉండాలంటే .ఇవి పాటించండి
Next articleAAI రిక్రూట్మెంట్ 2022 : ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..