బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 గురించి అప్డేట్స్ రానున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 పై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది.
ఇప్పటివరకు ఏడూ సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఓ ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో చివరిగా వచ్చిన సీజన్ 7 కు కూడా అంతే టీఆర్పీ వచ్చింది. మొదటి సీజన్ సక్సెస్ అయ్యిందంటే కారణం హౌస్ గా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లడం. ఆతర్వాత హౌస్‌లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్ ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఫినాలే రోజు జరిగిన రచ్చ కూడా అంతా ఇంతా కాదు. ఏకంగా బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసే దాకా వెళ్ళింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 8 పై ఉత్కంఠ మొదలైంది. ఈసారి హౌస్ లోకి ఎవరు ఎవరు వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీరే అని కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది తెలిసిన మొక్కలే వెళ్తున్నాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్ల ప్రకారం బర్రెలక్క, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి హేమ, నటి సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు, వేణు స్వామి, అమృత ప్రణయ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఓ యూట్యూబర్, నటి సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందని తెలుస్తోంది. సోనియా సింగ్ చాలా మంది తెలిసిన పేరే.. ఈ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. తన ప్రియుడు సిద్దూతో కలిసి ఆమె చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ శశి మథనం అనే ఓటీటీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు ఈ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి .