Indian OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్నా కమల్ హాసన్ భారతీయుడు 2 – మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Kamal Haasan Indian movie Release on OTT: లోకనాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2′(Indian 2).

జూలై 12న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చికుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సేనాపతిగా కమల్ యాక్టింగ్ బాగున్నప్పటికీ శంకర్ రోటిన్ స్టోరీతో బోర్ కొట్టించాడని ఆడియన్స్ నుంచి టాక్. ఈ సినిమా శంకర్ మార్క్ కనిపించలేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్కు ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 27 ఏళ్ల క్రితం కమల్-శంకర్ కాంబో వచ్చిన ‘భారతీయుడు’ బ్లాక్బస్టర్ విజయం సాధించింది.

ఇదే సినిమాకు శంకర్ సీక్వెల్గా ‘ఇండియన్ 2’ని తెరకెక్కించడంతో భారీ బజ్ నెలకొంది. అలా ఎన్నో అంచాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఇండియన్ 2 ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ తొలి పార్ట్ డిజిటల్ ప్రీమియర్కు రాబోతుంది. ఇండియన్ 2 రిలీజైన రెండు రోజులకే ‘భారతీయుడు’ సినిమాని ఓటీటీకి తీసుకువస్తుండటం విశేషం. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అది కూడా ఈ రోజు అర్థరాత్రి అంటే జూలై15 నుంచి ‘భారతీయుడు’ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్ ప్రకటన కూడా ఇచ్చింది. కాగా 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి నేపథ్యంలో ఈ సినిమా శంకర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ మొత్తంలో రూ.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా.. మనీషా కోయిరాల, ఊర్మిల మండోద్కర్, సుకన్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు రెండున్న దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వస్తుందని తెలిసి ఆయన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇండియన్ 2 రిలీజ్ కాగానే ప్రేక్షకులంతా ‘భారతీయుడు’ ఫస్ట్పార్ట్ కోసం ఓటీటీలో వెతికేస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకుని ప్రకటన ఇచ్చింది.

ఇక ‘భారతీయుడు 2’ ఓటీటీ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మూవీ ఈ సంస్థ స్ట్రిమింగ్ చేయబోతోంది. థియేటర్లో రిలీజైన ఏ సినిమా అయినా ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ తర్వాత రెండు నెలలకు ఏ సినిమా అయినా ఓటీటీలో రిలీజ్ చేయాలి. అయితే అది ఆ మూవీ రిజల్ట్ వచ్చిన బజ్ ఆధారంగా మూవీ ఓటీటీ రిలీజ్ని నిర్ణయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు 2’ అన్ని భాషల్లో డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక థియేట్రికల్ రన్ అనంతరం అ సినిమా వచ్చే నెల చివరిలో కానీ, సెప్టెంబర్ రెండో వారంలో కానీ ‘ఇండియన్ 2’ స్ట్రిమింగ్ వచ్చే అవకాశం ఉంది. ‘భారతీయుడు 2’లో కమల్హాసన్తో పాటు హీరోసిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Previous articleAnant Ambani: అనంత్ అంబానీ మల్లి బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తరువాత ఏం జరిగింది..?
Next articleIRCTC: వేచి ఉండకుండా తత్కాల్ టికెట్స్ తక్షణమే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా – ఇదిగో!