మైఖెల్ జాక్సన్ బయోపిక్: సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్.. హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో..?

Michael Jackson Biopic.. Sandeep Reddy Vanga Director.. Tollywood Star Hero as Hero..
Michael Jackson Biopic.. Sandeep Reddy Vanga Director.. Tollywood Star Hero as Hero..

టాలీవుడ్ లో మైఖెల్ జాక్సన్ బయోపిక్.. వింటానికే క్రేజీగా ఉందికదా..? టాలీవుడ రేంజ్ మారిపోయింది మరి. ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా..? సందీప్ రెడ్డి వంగా.

మరి హీరోగా మైఖెల్ పాత్ర చేసేది ఎవరంటే..?

సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రెస్సీవ్ డైరెక్టర్.. ఆయన సినిమాల్లో ఆ ఆవేశం కనిపిస్తుంది. అది ఇప్పటి వరకూ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. చేసింది మూడు సినిమాలే కాబట్టి.. ఎదురు దెబ్బలేమి తగల్లేదు. కాని ఆలోచనలేకుండా సినిమా చేసేసే దర్శకుడేం కాదు సదీప్. యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ఆనిమల్ సినిమాలు చూస్తే.. అది అర్ధం అవుతుంది.


అర్జున్ రెడ్డితో విజయ్ ను నిలబెట్టిన సందీప్ రెడ్డి.. కబీర్ సింగ్ తో షాహిద్ కు, ఆనిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ కు బాలీవుడ్ లో బారీ కలెక్షన్ల రికార్డ్ ను కట్టబెట్టాడు. మూడు సినిమాలతో ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవడ్ లో ఇలా స్టార్ స్టేటస్ సాధించిన దర్శకుడు ఎవరు ఉండకపోవచ్చు బహుషా. ఇక ఇప్పుడుప్రభాస్ తో స్పిరిట్ ను రెడీ చేసుకుంటున్నాడు సందీప్.

ప్రభాస్ సందీప్ రెడ్డివంగా చేతుల్లో పడ్డాడు. ఆ హైట్ కు.. పర్సనాలిటీకి .. సందీప్ రెడ్డీ జోరుకు..ఎలాంటి ప్రాడెక్ట్ బయటకు వస్తుందా అని అంతా ఎదరు చూస్తున్నారు. పైగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలియడంతో.. ఫ్యాన్స్ లో ఉత్సాహం ఆగడం లేదు.. ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా..? రిలీజ్ అవుతుందా..? చూసేద్దామా అని అంతా ఆరాటపడుతున్నారు. ఈక్రమంలో సందీప్ రెడ్డికి సబంధించిన మరో ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.


అదేంటంటే.. సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ లో ఒ ప్రయోగం చేయబోతున్నాడు. వరల్డ్ పాప్ స్టార్.. దివంగత మైఖెల్ జాక్సన్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం చేయబోతున్నాడట. నిజంగా ఇది ఓ పెద్ద సాహసమే అని చెప్పాలి. పైగా ఈ పాత్ర కోసం మన టాలీవుడ్ లో డాన్స్ అద్భుతంగా చేసే యంగ్ స్టార్ ను తీసుకున్నాడట సందీప్ రెడ్డి వంగా. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?

ఎవరో కాదు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవుతున్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేసిన తరువాత .. అల్లు అర్జున్ తో ఆల్ రెడీ కమిట్ అయిన సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈసినిమాకుకాస్త టైమ్ పట్టే అవకాశం ఉందట. ఎందుకంటే మైఖేల్ జాక్సన్ జీవితంలో కొన్ని ఘట్టాలను ఆదర్శంగా తీసుకుని ఈసినిమాను ప్లాన్ చేస్తున్నాడట సందీప్. అచ్చంగా బయోపిక్ చేయకుండా.. ఆ స్పిరిట్ మాత్రమే తసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


పైగా అర్జున్ రెడ్డి సినిమా కథ బన్నీ మిస్ చేసుకున్నాడు. చేసుంటే బాగుండేది అనుకున్నాడు. అందకే అన్నింటిని మించి తన సినిమా బెస్ట్ అవ్వడానికి ఎంత అఫర్ట్ పెట్టడానికైనా అల్లు అర్జున్ వెనకాడడు. అందుకే అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా చేయబోయేది. మైఖెల్ జాక్సన్ బయెపిక్ మూవీనే అంటున్నారు. మరి ఈ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ అయితే తప్ప కన్ ఫార్మ్ చేసుకోలేము. ఇప్పటివరకూ ఇది గాసిప్ గానే ఉంది.

ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ పుష్ప2 తో రికార్డ్ లు బ్రేక్ చేయడానికి గట్టిగా కష్టపడుతున్నాడు. కలెక్షన్లు 1000 కోట్లు దాటాల.. ఆస్కార్ కు వెళ్ళాలి అనే టార్గెట్ తో ఉన్నారు. అందుకు తగ్గట్టగానే సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ విన్నా ఈ పాటే మోగుతోంది. ఇక ఈ అగస్ట్ లో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే.. అది కాస్తా డిసెంబర్ కు వెళ్ళిపోయింది. ఇక క్రిస్మస్ కానుకగా పుష్ప2 సందడి చేయడానికి రెడీ అవుతుంది. మరి రిజెల్ట్ ఏమౌతుందో చూడాలి.

Previous articleBrain Eating Disease: దేశాన్ని వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి
Next articleసైబర్ సెల్ అవసరం లేకుండా ఏ నెంబర్ కాల్ హిస్టరీ అయిన ఇలా పొందండి